29-12-2023 RJ
సినీ స్క్రీన్
బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో స్కిన్ మాఫియా కథాంశంతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'మై నేమ్ ఈజ్ శృతి'. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ మరో వైవిధ్యభరిత సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు హన్సిక రెడీ అవుతోంది. ఆమె హీరోయిన్ గా రాజు దుస్స దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా '105 మినిట్స్' .
తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రుద్రాంశ్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బొమ్మ కె శివ నిర్మాత. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోషన్ పోస్టర్ లో రక్తపు గాయాలతో కుర్చీలో కూర్చున్న హన్సిక ఒక ఇంటెన్సిడ్ లుక్ కనిపిస్తోంది. ఈ మోషన్ పోస్టర్ ను 'మంగళవారం' డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదగా చిత్రయూనిట్ విడుదల చేసింది.
శ్యాం సియస్ సంగీతాన్ని అందించారు. ఈ మోషన్ పోస్టర్ మూవీపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. హన్సిక ఇంతకుముందు ఎన్నడు కనిపించని గెటప్లో చాలా కొత్తగా కనిపిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్.. అందులోనూ ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్ చేయడం హన్సికకి ఇదే మొదటిసారి. మాంక్ మరియు పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా డిస్టిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.