29-12-2023 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సూపర్ హీరో సిరీస్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తో పాటు ట్రైలర్ లు హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి.
ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి సెన్సార్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ చిత్రం తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా చూడటానికి 1.5 లక్షలకు పైగా అభిమానులు ఆసక్తికరంగా ఉన్నట్లు బుక్ మై షోలో వెల్లడించారు.