30-12-2023 RJ
తెలంగాణ
నిజామాబాద్, (డిసెంబర్ 30): తెలంగాణ వ్యవసాయ విధానం, వ్యవసాయ పథకాలు దేశానికి ఆద్శంగా నిలిచాయని, కాళేశ్వరంతో ప్రయోజనాలను తక్కువ చేసిచూపడం సరికాదని మాజీమంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. ఆస్తులను పెంచి ఇచ్చిన గనత కెసిఆర్దని అన్నారు. వ్యవసాయాభివృద్ధిపై కెసిఆర్ కు ఉన్న విజన్ మరెవరకీ లేదన్నారు. అందుకు తెలంగాణ వ్యవసాయాభివృద్ధి నిదర్శనంగా నిలిచిందని అన్నారు. దేశంలో నీటినరులు, అద్భుతమైన సారవంతమైన నేలలు ఉన్నాయని, వాటిలో బంగారు పంటలు పండించ వచ్చన్నారు. కానీ కెసిఆర్ లాంటి దమ్మున్న లీడర్ మాత్రమే అది చేయగలడని తెలంగాణలో నిరూపించారని అన్నారు.
తెలంగాణలో నీటివనరులను సక్రమంగా వినియోగించడంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కృషి చేసిందన్నారు. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి జరిగిందన్నారు. చెక్ డ్యామ్లతో నీటికి అడ్డుకట్ట వేసారని అన్నారు. ఇంకా జరగాల్సిన అనేక ప్రాజెక్టులు పూర్తిదశలో ఉన్నాయన్నారు. అయితే కొత్త ప్రబుత్వం కేవలం అభిరుద్దిని మాత్రమే గుర్తించాలని అన్నారు. కక్షసాధింపు ధోరణి సరికాదాని అన్నారు. కాళేశ్వరం కావచ్చు..మిషన్ భగీరథ కావచ్చు.. చేసిన అభివృద్ధిని తక్కువచేసే ప్రయత్నాలు సరికాదన్నారు.
ఇవన్నీకూడా తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేవే అని అన్నారు. నీటివనరులను సక్రమ వినియోగం విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లిందని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు వరం లాంటిదని అన్నారు. అలాగే రైతులు ఏ కారణం చేత మరణించినా అండగా నిలిచేలా రైతుబీమా కొనసాగింన్నారు. దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తే రైతులకు భరోసా దక్కుతుందన్నారు. ఇంత గొప్ప పథకం ద్వారా లబ్దిపొందుతున్న తెలంగాణ రైతులు కెసిఆర్ కు రుణపడి ఉండాలన్నారు.
నీటితీరువాను రద్దు చేయడం కూడా తెలంగాణలో మాత్రమే జరిగిందన్నారు. సమగ్ర నీటి విధానం అమలయితే దేశంలోని రైతులు ప్రపంచానికి అన్నం పెడతారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను తీర్చే దిశగా పని చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ విధానాల మేరకు నడుచుకునే మక్కు ఉందని అయితే బురదజల్లే ప్రయత్నాలు సరికాదన్నారు. తమకన్నా గొప్పగా చేసి ప్రజలతో భేష్ అనిపించుకోవాలని వేముల సూచించారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఆలోచన ఎవరికీ రాలేదు.
కేసీఆర్ కు అంతటి గొప్ప ఆలోచన వచ్చిందన్నారు. దీనిని కాపీకొట్టిన మోడీ కూడా పిఎం కిసాన్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, పుష్కలమైన సాగునీరు, మద్దతు ధరకు పంటల కొనుగోలు, సకాలంలో రువులు, విత్తనాల పంపిణీ ఇలా అన్నీ కేవలం తెలంగాణలో మాత్రమే అమలయిన కార్యక్రమాలన్నారు.
కెసిఆర్ దూరదృష్టితో నీటివనరులను అభివృద్ధి చేయడంతో భూగర్భ జలాలలు కూడా బాగా పెరిగాయన్నారు. తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేసిన ఘనత కెసిఆర్దని అన్నారు. కాంగ్రెస్ తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ముందుకు సాగాలని, ముందు వాటి సంగతి చూడాలని అన్నారు. మరింతగా అభివృద్ధి, సంక్షేమం చేసి చూపాలన్నారు. తాము చేసిన మంచి పనులను కొనసాగిస్తే మంచిదన్నారు.