ad1
ad1
Card image cap
Tags  

  30-12-2023       RJ

ప్రజా పాలనతో గ్రామాల్లో సందడే సందడి

తెలంగాణ

హైదరాబాద్, (డిసెంబర్ 30): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన' కార్యక్రమం గ్రామాల్లో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రజలు సమస్యలపై స్పందిస్తున్నారు. ఇచ్చిన హామీలను పొందడానికి దరఖాస్తు చేసుకునేందుకు పోటెత్తారు. 5 గ్యారెంటీలకు సంబంధించి లబ్ది కోసం దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు గ్రామ, వార్డు, డివిజన్ సభలకు పోటెత్తుతున్నారు. ఈ నెల 28 గురువారం నుంచి దరఖాస్తు స్వీకరణ పక్రియ ప్రారంభం కాగా, తొలి రోజు 7,46,414 అర్జీలు రాగా, రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా 8,12,862 అర్జీలు వచ్చాయి. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, పట్టణాల్లో 4,89,000 దరఖాస్తులు రాగా, గ్రామాల్లో 3,23,862 అప్లికేషన్స్ వచ్చాయి.

దరఖాస్తులు ఉచితంగానే ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, కొన్ని చోట్ల కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు రూ.20 నుంచి రూ.100కు ఫారాలు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు సైతం అర్జీదారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. కానీ, జిరాక్స్ తీసిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించడంతో ప్రజలు నిరాశ చెందారు. `ప్రజాపాలన'లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభలు నిర్వహిస్తున్నారు. అయితే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచే జనం కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు.

ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇవే కాకుండా గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలకు సైతం అధిక సంఖ్యలో అప్లై చేసుకుంటున్నారు. కొన్ని కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని వాపోయారు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో దరఖాస్తులు కొరతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల నిరక్ష్యరాస్యులు దరఖాస్తులు నింపలేకపోవడంతో కొందరు డబ్బులు తీసుకుని వాటిని నింపారు. దరఖాస్తులు నింపి అధికారులకు ఇచ్చే సమయంలో ప్రజల నుంచి పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.

రేషన్ కార్డు స్వగ్రామంలో ఉండగా, కుటుంబంతో హైదరాబాద్ లో ఉంటున్నామని, తాను ఎక్కడ దరఖాస్తు చేయాలనే సందేహం కొందరు వెలిబుచ్చారు. అలాగే, గ్యాస్ కనెక్షన్లు మగవారి పేరు మీద ఉన్నాయి. రాయితీతో రూ.500కు సిలిండర్ వస్తుందా... కనెక్షన్ మార్పించుకోవాలా... అంటూ ప్రశ్నించారు. అయితే, వీటిపై అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. ఫారం 4 పేజీల్లోనూ ఎక్కడా లబ్దిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతా నెంబర్ ప్రస్తావించలేదు.

దీంతో చాలా మందిలో నగదు సహాయం ఎక్కడ జమ చేస్తారు అనే సందేహం నెలకొంది. ఒక ఇంట్లో 2కంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నవారూ ఉంటున్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగానికి రాయితీ ఇందులో ఏ కనెక్షన్ కు వర్తిస్తుంది అనే అనుమా నాలను అధికారుల వద్ద అర్జీదారులు వ్యక్తం చేశారు. అయితే, ముందు దరఖాస్తులు సమర్పించా లని ఆ తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

రెండో రోజు 'ప్రజాపాలన’ కార్యక్రమంపై శుక్రవారం కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు దరఖాస్తులను డబ్బులు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి తేవొద్దని నిర్దేశించారు. కేంద్రాల వద్ద బారికేడింగ్, తాగునీటి సదుపాయం, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP