ad1
ad1
Card image cap
Tags  

  30-12-2023       RJ

సీఎం రేవంత్ ను కలిసిన మాజీ డీఎస్పీ నళిని

తెలంగాణ

హైదరాబాద్, (డిసెంబర్ 30): తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమకారులపై లాఠీ ఝుళిపించలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన నళిని తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవలే జరిగిన పోలీసు శాఖ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే.

తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యం లోనే నళిని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛం అందించి అభినందలు తెలిపారు. కాగా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న ఆమె సీఎంకు కొన్ని పుస్తకాలు అందించారు. నళిని మాత్రం తిరిగి ఉద్యోగంలో చేరేందుకు సుముఖంగా లేరు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తరవాత మాజీ డీఎస్పీ నళిని మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు తనకు ఉద్యోగం అవసరం లేదని స్పష్టం చేశారు. డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయట పడ్డాను? ఇప్పుడు తనది ఆధ్యాత్మిక మార్గమని తెలిపారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.

త్వరలోనే వేదం, యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మ ప్రచారానికి పనిచేస్తా.. గతంలో నేను, తోటి ఉద్యోగులు.. డిపార్ట్మెంట్ లో ఎదుర్కొన్న సమస్యలపై సీఎంకు రిపోర్ట్ ఇచ్చానని తెలిపారు. తనలా ఎవరూ బాధపడవద్దన్నదే తన అభిప్రాయమన్నారు. ఇప్పుడు బ్యురొక్రసి మీద నమ్మకం పోయింది? అందుకే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నా.. నాకు జరిగిన అన్ని విషయాలు.. సీఎం దృష్టికి తీసుకెళ్లాను.

నా మనసుకు నచ్చిన సేవ చేస్తున్నాను. ఇన్నాళ్ల నా మనొవ్యధను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందని నళిని తెలిపారు. గతంలో ఆమె రెండు సార్లు సోషల్ మీడియాలో స్పందించారు. జీవితంలో సర్వస్వం కోల్పోయిన తాను.. ఇప్పుడు మరో మార్గం ఎంచుకున్నానని దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడని చెప్పుకొచ్చారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారని అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నానన్నారు.

వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. ఉద్యోగం అవసరం లేదు కానీ ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాన్నారు. సాయం కోసం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీగా ఉన్నారు. ఉద్యమంలో భాగంగా ఉద్యమానికి రాజీనామా చేశారు.

తర్వాత రోశయ్య హయాంలో ఉద్యోగం ఇచ్చినా అనేక రకాల వేధింపులకు గురి కావడంతో రాజీనామా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు కానీ.. రాజకీయంగా కూడా కలసి రాకపోవడంతో ఆమె అధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. రేవంత్ సీఎం అయ్యాక ఉద్యమ కారులందరూ ఆమెను గుర్తు చేసుకోవడంతో మళ్లీ వెలుగులోకి వచ్చారు. అధ్యాత్మక మార్గంలో ఉన్నట్లుగా అందరికీ వివరించారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP