30-12-2023 RJ
తెలంగాణ
కామారెడ్డి, (డిసెంబర్ 30): 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. 28 హత్యలలో 20 హత్యలు ఆస్తి, కుటుంబ సభ్యుల తగదాలతో జరిగినవన్నారు. 2023 సంవత్సరంలో 496 రోడ్డు ప్రమాదలలో 45 మంది మరణించినట్లు వెల్లడించారు. సైబర్ క్రైమ్ 240 కేసులు జరుగాగ... ప్రతి నెల మొదటి బుధవారం అన్ని పోలీస్ స్టేషన్ లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏఎర్పాటు చేసినట్లు తెలిపారు.
2023 సంవత్సరంలో 40 ట్రాన్స్ ఫార్మర్ కేసులను ఛేదించామని.. 72 ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైరు, ఆయిల్ విలువ సుమారు 7 లక్షల 60 వేల రూపాయలని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దొంగిలించబడ్డ 51 ద్విచక్ర వాహానాలను ఒకేసారి స్వాధీనం చేసుకున్నామని.. వాటివిలువ సుమారు 36 లక్షల 60 వే రూపాయలు అని ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు.