30-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 30): తెలంగాణ గవర్నర్ గా తాను సంతోషంగా ఉన్నానని గవర్నర్ రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దు అని గవర్నర్ హెచ్చరించారు. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తెలియజేస్తానని? రాజకీయాలు అనేవి తన కుటుంబ నేపథ్యంలోనే ఉన్నాయని ఆమె వివరించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు జోరందుకున్నాయి. తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారనీ, సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలన్నీ అవాస్తవాలని తమిళిసై స్పష్టం చేశారు.