30-12-2023 RJ
తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం, (డిసెంబర్ 30): విద్యుత్ సెక్టార్ ను గత ప్రభుత్వం అప్పుల ఊబిగా మార్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోమారు విమర్శించారు, ఉన్న లెక్కలను తాము నిగ్గు తేలుస్తతున్నామని అన్నారు. భద్రాచలం పవర్ ప్లాంట్ ను ఆయన శనివారం పరిశీలించారు. బీటీపీఎస్ ను పరిశీలించడానికి, అవగాహన చేసుకోవడానికి, రివ్యూ రూపేనా తెలుసుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అనంతం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శాఖలలో అందివచ్చిన కాడికి అప్పులు చేసిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.81514 కోట్ల అప్పులు చేసిందన్నారు. ప్రభుత్వం నుండి డిస్కంలకు రూ.28000 కోట్ల బకాయి పడి ఉన్నామన్నారు. తాము ఉంటేనే కరెంట్ సాధ్యం అని చెప్పిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందన్నారు. విద్యుత్ కొనడానికి 30 వేలకోట్ల రూపాయల 59580 కోట్ల పవర్ పరిచేజ్ మీద అప్పు చేసిందన్నారు. రాష్ట్ర విబజన నాటికి రూ.7250 కోట్ల బకాయి మాత్రమే ఉందన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు రూ.50,000 కోట్ల అప్పు ఉందన్నారు.
వాస్తవాలు అన్నీ కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం ద్వారా విడుదల చేశామన్నారు. అప్పుల నుంచి విముక్తులై గాడిలో పెట్టడానికి నిరంతరం శ్రిమస్తున్నామని, సమీక్షిస్తున్నామని, గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇవన్నీ గాలి లెక్కలు కాదని చెప్పుకొచ్చారు. ఉన్నరికార్డ్స్ ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు. పవర్ సెక్టారు గత ప్రభుత్వం పీకలదాకా ముంచేయగా.. ఈ ప్రభుత్వం ఈ అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తుందన్నారు. బీటీపీఎస్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హాని కలుగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామన్నారు.
ఇప్పుడున్న బీటీపీఎస్ వలన చాలా ఇబ్బందులు ఉన్నాయని... దీనిని అధిగమించే ప్రయత్నం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసి వెళ్లారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయన్నారు. 'భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నామంటూ భారీగా అప్పులు చేశారు.
రాష్ట్రాన్ని భయంకరమైన స్థితికి తెచ్చారు. అందుకే అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసి కొంత మేర వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ప్రణాళిక, ముందుచూపుతో అడుగులు వేయాల్సి ఉంది. ప్రతి శాఖలోనూ తాజా పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులు తెలుసుకుంటున్నామని తెలిపారు.
తమతోనే కరెంట్ అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖను అప్పుల్లోకి నెట్టారని సింగరేణికి రూ.19 వేల కోట్లు బకాయి పడ్డారని భట్టి తెలిపారు. అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటిపై సమగ్ర సమాచారం సేకరించి ప్రజల ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.81,514 కోట్ల అప్పులు చేసిందని, ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ.28 వేల కోట్ల బకాయి పడి ఉన్నామని వివరించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల అప్పు ఉందని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హాని కలగకుండా నిపుణుల సూచనలతో ముందుకు వెళ్తామన్నారు.