30-12-2023 RJ
తెలంగాణ
రంగారెడ్డి, (డిసెంబర్ 30): బైక్ లో తరలిస్తున్న రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ నుంచి కటేధాన్ వెళ్లే దారిలో గగన్ పహాడ్ వద్ద గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ.2.5 లక్షల విలువ గల ఎండు గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్, స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అజయ్ పటేల్, బీహార్ కు చెందిన అనిల్, హర్యానాకు చెందిన ఖలీల్ గా గుర్తించారు.