30-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విజయనగరం, (డిసెంబర్ 30): అంగన్వాడీలు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మంత్రి బొత్స ఇంటిని ముట్టించేందుకు వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని లేదంటే తగిన గుణపాఠం చెబుతామని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హేల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి. పైడిరాజు, ఎస్ అనసూయలు హెచ్చించారు. శనివారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్లు మీదుగా కోరాడ వీధిలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి వేలాదిమంది ర్యాలీగా చేరుకున్నారు.
అప్పటికే డిఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అంగన్వాడీలు ను ఇంటి వరకు రానివ్వకుండా కొద్ది దూరంలో మంత్రి ఇంటి వైపు వెళ్లే రోడ్డు వైపు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు రోడ్డు పై బైఠాయించారు. పోలీసులు నాయకత్వం రావాలని మంత్రి బొత్స ఇంటిలో లేరని కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాలో ఉన్నారని, ఆయనను రప్పించాలని డిమాండ్ చేశారు. సుమారుగా రెండు గంటలు పాటు అదే రోడ్డు పై బైటాయించారు.
మంత్రి లేకపోతే కుటుంబ సభ్యుల ఎవరు ఉంటే వారికి మేము అందరం వెళ్లి వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోత మని తెలిపారు.పోలీసులు ససేమిరా అనడంతో అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులను నెట్టుకుని ఇంటికి వెళ్లేందుకు దూసుకెళ్లారు.దీంతో పోలీసులు అడ్డంగా పెట్టిన డివైడర్ ను తోసుకుంటూ ముందుకు వెళ్ళారు..దీంతో పోలీసులు 50 మంది నాయకులను వెంట తీసుకొని వెళ్ళి మంత్రి బొత్స సత్యనారాయణ పిన్నమ్మకు వినతి పత్రం అందజేశారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు కోట జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించడంతో నగరంలో భారీగా ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.
బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు వి. లక్ష్మి, అధ్యక్ష కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్.అనసూయ, సి ఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్,రాష్ట్ర కమిటీ సభ్యులు టి వి రమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ లు మాట్లాడుతూ అంగన్వాడీలు గత 19 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం అంగన్వాడీ ల డిమాండ్ల పరిష్కారం చేశామని చెప్పడం, తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఏమి అదనంగా కోరడం లేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. అన్ని రకాల ధరలు పెరిగాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఇవ్వడంలేదని అన్నారు. అంగన్వాడీ లకు ఇస్తున్న గౌరవ వేతనం పిల్లలకు పెట్టాల్సి వస్తుందన్నారు.
మా సమస్యలు పెద్ద సమస్యలు కాదు, లక్షలు కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు, బడాబాబులు కు ఇస్తున్నారు మేము నిరంతరం ప్రజలకు చిన్న పిల్లలకి, గర్బీనీలకు సేవలు అందిస్తున్నామన్నారు. సేవాభావంతో పని చేస్తున్న మాకు ప్రభుత్వం మా గురుంచి అలోచించాల్సిన అవసరం ఉందన్నారు.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నా మన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో మనకంటే వేతనాలు ఎక్కువ చెల్లిస్తున్నారు మన ప్రభుత్వం ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. ఎవ్వరూ లేనప్పుడు మా కేంద్రాలు తాళాలు పగలు కొట్టిన మీరు బొత్స ఇంటికి వెళ్లేందుకు అడ్డుకునే హక్కు ఎవరిచరని ప్రశ్నించారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలు కొడితే మీరేమి చేశారని ప్రశ్నించారు.మంత్రి బొత్స సత్యనారాయణ మా సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే అంగన్వాడీలు అగ్రహానికి గురైన గత ప్రభుత్వాలు గతే మీకు పడుతుందని హెచ్చరించారు. ముట్టడి కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు బి.సూర్యనారాయణ, యు ఎస్ రవికుమార్, బి. రమణ, మాణిక్యం, శ్యామల, కృష్ణమ్మ వెలాదిగా తరలి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు అయాలు పాల్గొన్నారు.