30-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 30): శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు కలిసి అభినందనలు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు సీపీఎం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర బసవతారకం ఆస్పత్రి వైద్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. సిఎంకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా సిఎంను తల్లిదండ్రులతో కలసి బినందించారు. ఇకపోతే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, వైద్యలింగం, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసారు.