30-12-2023 RJ
సినీ స్క్రీన్
మెగా బ్రదర్ నాగబాబు, రామ్ గోపాల్ వర్మల మధ్య మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. రీసెంట్ గా వర్మ ఓ ఛానల్లో తనని టార్గెట్ చేస్తూ ప్రసారాలు చేశారని.. అందుకు సంబంధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాగబాబు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. నాగబాబు చేసిన పోస్టు వర్మ కూడా అదే విధంగా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. వర్మ రిప్లైకి మరోసారి నాగబాబు థ్రెడ్స్ వేదికగా స్పందిస్తూ 'కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ షాకింగ్ స్పందించారు.
వర్మ గారు మీరు నా పోస్ట్ కి స్పందించినందుకు చాల సంతోషంగా ఉంది కొంచెం షాక్కి కూడ గురయ్యాను. ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు. మీ ఆత్మ మాత్రమే తిరుగుతోంది అది గ్రహించాలి మీరు, ఏదోక రూపంలో నా పోస్ట్క బదులు ఇచ్చినందుకు సంతోషం, ఎప్పటికి మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను... అని మెగాబ్రదర్ నాగబాబు థ్రెడ్స్ లో పోస్ట్ చేశారు.
అంతకు ముందు.. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన వర్మను ఉద్దేశించి.. ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీగారూ మీరేం భయపడకండి.. మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే.. ఆంధప్రదేశ్లో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా.. మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి.
మీ శ్రేయోభిలాషి' అంటూ నాగబాబు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు వర్మ స్పందిస్తూ.. 'సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు.. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ లను చూసిన వారంతా.. మళ్లీ నాగబాబు, వర్మల మధ్య యుద్ధం మొదలైందిరో.. అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.