30-12-2023 RJ
సినీ స్క్రీన్
దేశీయ సినిమాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికల్లో నయనతార ఒకరు. దక్షిణాది అభిమానులు ఆమెను లేడీ సూపర్స్టార్గా అభివర్ణిస్తారు. వాణిజ్య చిత్రాల కథానాయికగానే కెరీర్ను ఆరంభించిన ఈ అమ్మడు అనంతర కాలంలో పంథా మార్చుకుంది. మహిళా ప్రధాన చిత్రాల ద్వారా తిరుగులేని స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. ఈ భామ సినీరంగంలో ఇరవై ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. అభిమానులే నా హృదయ స్పందన. నన్ను నడిపించిన శక్తి మీరే. కెరీర్లో అపజయాలు ఎదురైన ప్రతీసారి చేయూతనందించి నాలో నైతిక స్థైర్యాన్ని నింపారు.
మీవల్లే ఈ ఇరవై ఏండ్ల ప్రయాణం సాధ్యమైంది. మీ అందరి ఆనందాన్ని ఈ రోజు నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా. మీ ప్రేమ, ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని నయనతార ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొంది. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నయనతార.. 'జవాన్' చిత్రం ద్వారా బాలీవుడ్ లో అరంగేట్రం చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం నయనతార తమిళంలో అన్నపూరాణి, టెస్ట్, మన్నన్ట్టి సిన్స్ 1960 చిత్రాల్లో నటిస్తున్నది.