31-12-2023 RJ
సినీ స్క్రీన్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్భన్ కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి వేడుకకు అంతా సిద్ధమవుతోంది. తన ఫిటెనెస్ ట్రైనర్ అయిన నుపుర్ శిఖరే ని ఐరా ఖాన్ ప్రేమించి పెళ్లాడబోతోంది. కుమార్తె ప్రేమను ఆమిర్ ఖాన్ అంగీకరించడమే కాకుండా.. వారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఐరా, నుపుర్ల నిశ్చితార్థం 2022 నవంబర్ 18న జరగగా.. పెళ్లి 2024 జనవరి 3వ తేదీన ముంబైలోని 'తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్'లో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం.. ప్రీ వెడ్డింగ్ పనులను జరుపుకుంటూ వస్తున్నారు.
రీసెంట్ గా ముంబైలో ఓ గ్రాండ్ పార్టీని జరిపినట్లుగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో ఐరా, నుపుర్ ఒకరినొకరు చూసుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఇక వీరి మ్యారేజ్ రిసెప్షన్ కు సంబంధించి బాలీవుడ్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. న్యూ ఇయర్ కావడంతో.. ఆ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్న సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కావడం కష్టం అని భావించిన ఆమిర్ అండ్ ఫ్యామిలీ.. రిసెప్షన్ ను మాత్రం భారీ స్థాయిలో గ్రాండ్ గా నిర్వహించాలని తెలుస్తోంది.
జైపూర్ లో లావిస్ రిసెప్షన్ ను ప్లాన్ చేశారని, ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖు లెందరో హాజరుకానున్నారనేలా టాక్ వినిపిస్తోంది. ఐరా, నుపుర్ల విషయానికి వస్తే.. ఆమిర్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపుర్ వద్ద.. ఐరా కూడా ఫిటెనెస్ పాఠాలు నేర్చుకునేది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వారి ప్రేమను పెద్దవాళ్లకి తెలియజేయడం.. ఇరు ఫ్యామిలీ మెంబర్స్ వారి పెళ్లికి అంగీకరించడం వంటివి చకచకా జరిగిపోయాయి.