31-12-2023 RJ
సినీ స్క్రీన్
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ గుంటూరు కారం. ఎస్ఎస్ఎంబీ 28గా వస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం రానున్న జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి 'కుర్చీ మడతపెట్టి' అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ ప్రోమో చూస్తే.. మహేశ్ బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది. టైటిల్ కు తగ్గట్టుగానే ఘాటెక్కిస్తూ.. ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఈ పాట ఇంత రేంజ్లో సక్సెస్ అవ్వడానికి కారణం కుర్చీ తాత. కుర్చీ తాత సరదాకి 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే.
దీంతో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఈ డైలాగ్ ను హుకప్ లైన్ గా తీసుకుని రామజోగయ్య శాస్త్రి గుంటూరు కారంలో ఏకంగా ఒక పాటనే రాశాడు. అయితే తన డైలాగ్ ను గుంటూరు కారం సాంగ్ లో పెట్టడంపై తాజాగా కుర్చీ తాత స్పందించాడు. గుంటూరు కారంలో నా డైలాగ్ రాసిన పాటను మహేశ్ బాబు డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
అంత గొప్ప నటుడు నా డైలాగ్ లు పాట రూపంలో చేసి డాన్స్ చేయడం సంతోషంగా అనిపించింది. నేను అభిమానులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్న జనవరి 12 నాడు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. ఇంకా సినిమా విడుదలకు రెండు వారలు టైం ఉంది. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే మహేష్ బాబుతో ఆ పాటలో ఒక్క చరణానికి అన్న డ్యాన్స్ చేస్తా అంటూ కుర్చీ తాత చెప్పుకోచ్చాడు.