01-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (జనవరి 1): రాష్ట్ర ప్రజలందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడు ప్రకృతి ప్రకోపాలు, పాలకుల ప్రతాపాలు లేని కాలమవ్వాలన్నారు. కార్మిక, కర్షక శ్రేయస్సు వర్ధిల్లాలన్నారు. ఎన్నికల రణరంగంలో ప్రజలే పాలకులుగా గెలవాలన్నారు. కుల, మత విద్వేషాలు లేని సమ సమాజం రావాలన్నారు. సకల శుభాలూ ప్రజలందరికీ బానిసవ్వాలని రామకృష్ణ పేర్కొన్నారు.