01-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
పల్నాడు, (జనవరి 1): జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టుబడింది. గురజాల పోలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్ఐ మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద గత రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీలో మద్యం పట్టుబడింది. ఏఎస్ఐ స్టాలిన్ తో పాటు మరో ఇద్దరి నుంచి 42 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.