01-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, (జనవరి 1): వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4యేళ్ల 9నెలలు అయ్యిందని.. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలే జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.
ఈ ప్రభుత్వంపై ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని... ఎటువంటి సందేహమూ లేదన్నారు. విజయవాడ పార్లమెంట్లో ఉన్న 16లక్షల మంది ఓటర్లు తనతో ఉన్నారని.. తాను కూడా వాళ్లతో ఉంటానని కేశినేని నాని అన్నారు.