01-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు, (జనవరి 1): కావలిలో రూల్స్ బ్రేక్ చేసిన డీఎస్పీ వెంకటరమణపై స్థానికులు మండిపడ్డారు. కావలిలో నడిరోడ్లపై న్యూ ఈయర్ వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ముందుగానే డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అర్ధరాత్రి వేళల్లో కావలి డీఎస్పీ కార్యాలయం ఎదుటనే వైసీపీ శ్రేణులు నడిరోడ్డుపై వేడుకలు నిర్వహించాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు, డీఎస్పీ వెంకటరమణ కూడా పాల్గొనడం గమనార్హం.
వేడుకల చివరిలో వైసీపీ రెండు వర్గాలు కొట్లాట జరిగింది. అసలు వేడుకలు నిర్వహిస్తేనే అరెస్ట్ చేస్తామన్న డీఎస్పీ.. ఆ వేడుకల్లో పాల్గొనడం.. పైగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగినా కూడా చూస్తూ ఉండటంపై డీఎస్పీ వెంకట రమణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే, శ్రేణుల విషయంలో పోలీసులకి రూల్స్ వర్తించవా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.