01-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (జనవరి 1): ఏపీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీఎస్ జవహర్ రెడ్డి కేక్ కట్ చేయించారు. ఈ క్రమంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మరోవైపు.. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ను టీటీడీ వేదపండితులు, దుర్గగుడి వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అర్చకులు అందించారు. ఇక, దుర్గ గుడి వేదపండితులు అమ్మవారి చిత్రపటం, క్యాలెండర్, ప్రసాదాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.