01-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, (జనవరి1): భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కాగా, పీఎస్ఎల్వీ-సీ58పై గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించారు.ఈ సందర్భంగా రాకెట్ విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు చెప్పారు.
అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్ న అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున మిషన్ ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్ఎల్వీ-సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని అని ఆకాంక్షించారు.