ad1
ad1
Card image cap
Tags  

  01-01-2024       RJ

21వ రోజుకు అంగన్వాడీల సమ్మె..

ఆంధ్రప్రదేశ్

  • సాంస్కృతిక కార్యక్రమాలతో నిరసనలు

విజయవాడ, (జనవరి 1): అంగన్వాడీల సమ్మె 21వ రోజుకు చేరింది. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నిరసనలు తెలిపారు. సిఎం జగన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ పలు రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేసారు. పలు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీల మధ్య వాగ్వివాదం నెలకొంది.

కొన్ని చోట్ల అరెస్టులు కూడా జరిగాయి. విజయవాడలో ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీ లు మ్యూజికల్ చైర్స్ ఆడి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు నూతన సంవత్సరం అని చూడకుండా అంగన్వాడిలు సమ్మె శిబిరానికి చేరుకున్నారు. సమ్మెను ఉద్దేశించి సిఐటియు ఎఐటియుసి నాయకులు మాట్లాడారు. రెండు రోజులలో ప్రభుత్వం అంగన్వాడి సమస్యలపై స్పందించకుంటే కలెక్టరేట్లను ముట్టరిస్తామని వారు హెచ్చరించారు.

గత 20 రోజులుగా అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలు రోడ్లపై సమ్మెలు చేస్తుంటే కళ్ళులేని కబోది లాగా చెవులు లేని చెవిటివాడి లాగా నోరు ఉండి మాట్లాడలేని మూగవాడిలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల వైపు చూసి ఈ నూతన సంవత్సరంలో సరైన నిర్ణయం తీసుకుని అంగన్వాడీల సమస్యపై స్పందిస్తే భవిష్యత్తు ఉంటుందని లేదంటే రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీలు చేసే పోరాటాలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వారు హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 మంది అంగన్వాడీలు క్రిస్టమస్ పండగ నూతన సంవత్సర వేడుకలు చేసుకోకుండా ఇంట్లో కుటుంబాలను వదులుకొని పిల్లలను భర్తలను వదులుకొని రోడ్లపై అనేక రూపాలలో ఆందోళన చేస్తూ ప్రభుత్వం నిర్భందకాండను గత 20 రోజులుగా ఎదుర్కొంటూ ఉద్యమం సాగిస్తున్నారని అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అనేక రూపాలలో తమ మద్దతును తెలియజేస్తున్న కార్మిక సంఘాలు పార్టీలు ఉద్యోగ సంఘాలు లాయర్స్ అసోసియేషన్ లు ముందుకు వచ్చి అంగన్వాడీల సమ్మె కు మద్దతు తెలుపుతున్నారు.

అధికార పార్టీ శాసనసభ్యులు గాని పార్లమెంటు సభ్యులు గాని స్థానిక కార్పొరేటర్లు గాని మహిళల గోడు పట్టడం లేదా వినిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని అంగన్వాడీలు న్యాయం గా కోరుతున్న కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని గ్రాడ్యుటి 5 లక్షల ఇవ్వాలని టిఎ డిఏ బకాయి బిల్లులు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని నాయకులు తెలిపారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP