01-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 1): రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. రాజ్ భవన్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ గవర్నర్ దంపుతలకు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ చెప్పారు. సీఎంగా రేవంత్ రాజ్ భవన్ కు వెళ్లడం ఇదే తొలిసారి. రేవంత్ వెంట మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు. అంతకుముందు సెక్రటేరియట్ లో కొత్త ఏడాది హంగామా కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ చెప్పారు మంత్రులు.
మంత్రి సీతక్క రేవంత్ ను కలిసి విషెస్ చెప్పారు. ఇందిరాగాంధీ ఫోటోను రేవంత్ కు బహుమతిగా ఇచ్చారు. అధికారులు, మినిస్టర్స్, పరస్పరం న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. మరోవైపు సీఎంను కలిసేందుకు జనం క్యూకట్టారు. సెక్రటేరియట్ చుట్టూ సీఎం రేవంత్ కటౌట్స్ ఏర్పాటు చేశారు.