01-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, (జనవరి 1): భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారా దర్శన అనంతరం ఆలయం వెలుపల కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఇజ్రాయెల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఈ ఏడాదిలో పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. అందులో భారత్ కీలక పాత్ర షోషించనుందని చెప్పారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ 'ఏడాదిలోనే జరగనుందని చెప్పారు.