01-01-2024 RJ
సినీ స్క్రీన్
ఎన్టీఆర్ హీరోగా, జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న 'దేవర' చిత్రం అప్డేట్ గురించి ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరం వచ్చిన వేళ టీజర్, గ్లింప్ ఏదైనా వదులుతారేమో అని ఎదరుచూశారు. కానీ ఎన్టీఆర్ కొత్త లుక్ తో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. దాంతో అభిమానులకు ఓ శుభవార్త కూడా చెప్పారు.
ఈ నెల 8న పవర్ఫుల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిఫైయింగ్ దేవర ఈయర్' అంటూ ఎనిమిదో తేదిన సాలిడ్ గ్లింప్స్ రాబోతోంది అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. పడవ మీద రౌద్రంగా చూస్తూ నిల్చున ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆమెకిది తెలుగులో తొలి చిత్రం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.