01-01-2024 RJ
సినీ స్క్రీన్
గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు సెలబ్రిటీలు. నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరం సక్సెస్ ఫుల్ గా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రియులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. 'గడిచిన ఏడాది (2023) తెలుగు సినిమాకు, ఇండియన్ సినిమాకు చారిత్రాత్మక సంవత్సరంగా చెప్పుకోవచ్చు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో రకాలుగా విజయాలు అందుకొంది. ఆస్కార్, గోల్డెన్ క్లబ్, జాతీయ పురస్కారాలు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇలా చెప్పుకుంటే ఎన్నో విజయాలు అందుకున్నాము. వైవిధ్యమైన కథా చిత్రాలతో సరిహద్దులను దాటాము. ఈ ఏడాది సాధించిన విజయాలు, పురస్కారాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచపటంలో నిలిచిపోయింది.
మన స్థాయి పెద్దది, మరిన్ని మంచి విషయాలను సాధించడానికి కలలు కనే ధైర్యం చేయవచ్చు. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు' అని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు. చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఈ చిత్రం ఉంది.