01-01-2024 RJ
సినీ స్క్రీన్
నాగార్జునతో కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ తో చేస్తున్న 'నా సామి రంగ' విడుదల తేదీ అధికారికంగాప్రకటించారు. జనవరి 14న సంక్రాంతి పండగ సినిమా పోటీలో ఉన్నామని చెప్పారు. ఈ సినిమా విడుదల తేదీతో ఈసారి పోటీ చాలా రసవత్తరంగా వుండబోతోంది అని పరిశ్రమలో అందరూ ఎదురు చూస్తున్నారు.
మహేష్ బాబు టించిన 'గుంటూరు కారం' తేజసజ్జ నటించిన 'హనుమాన్', జనవరి 12న విడుదల అవుతూ ఉండగా, వెంకటేష్ నటించిన 75వ సినిమా 'సైంధవ్' జనవరి 13న, అదే రోజు రవితేజ నటించిన 'ఈగిల్' కూడా విడుదలవుతోంది. ఇప్పుడు నాగార్జున సినిమా జనవి 14న విడుదలవుతోంది అని ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఇంకో పక్క తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఈ సినిమా నిర్మాతలతో సమావేశం అవుతూ వున్నారు. ఎందుకంటే కొన్ని సినిమాలకి థియేటర్స్ దొరకటం కష్టం, అందుకని తేదీలు మార్చుకోండి అని అంటున్నారు, కానీ ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున ’నా సామి రంగా' సినిమా షూటింగ్ ఇంకా చాలా వుంది అని ఒక సమాచారం.