ad1
ad1
Card image cap
Tags  

  05-01-2024      

షర్మిల రాకతో.. మారననున్న రాజకీయ సమీకరణాలు

ఆంధ్రప్రదేశ్

విజయవాడ, (జనవరి 5): ఎపి రాజకీయాలు వేడెక్కాయి. అనూహ్య మలుపులు తిరగబోతున్నాయి. షర్మిల రాకతో ఇక తమకు అంతా సానుకూలమే అన్న ధోరణిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అన్నత జగన్ వదిలిన బాణాం ఇప్పుడు బూమరాంగ్ అవుతోంది. ఈ బాణం అన్నను దెబ్బతీయడానికా లేక.. టిడిపి, జనసేన, బిజెపిలను దెబ్బతీయడానికా అన్నది ప్రజల చేతుల్లో ఉంది. షర్మిలను ఎపి కాంగ్రెస్ రాజకీయాల్లో దింపేది లేనిదీ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే తెలంగాణలో ఆమెతో పనిలేదు.

తనవల్లనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని షర్మిల చెప్పుకోవడం కూడా అతిశయం తప్ప మరోటి కాదు. ఢిల్లీలో ఓ వైపు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సమయంలోనే.. ఎపి సిఎం జగన్ తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్ ను పరామర్శ పేరుతో కలిసి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్షేమమే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్ తను ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చానని పదే పదే చెబుతూనే వస్తున్నారు. ఆ నమ్మకంతోనే వైనాట్ 175 అంటూ .. ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

సిట్టింగ్లను మార్చేయటం, వారసులకు టికెట్లు ఇవ్వటం వంటివన్నీ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో షర్మిల కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లోనే సంచలనంగా మారనుంది. ఇది రెండోసారి అధికారంలోకి రావాలను కుంటున్న జగన్ ఆశయానికి దెబ్బగానే పరిగణించాలి. జగనన్న వదిలిన బాణంగా ఆ పార్టీ అధికారంలోకి రావటానికి సాయపడిన సొంత రక్తమే ఇప్పుడు బాకులా మారి విజయానికి అడ్డుపడనుందా.. అన్న చర్చ ఇప్పుడు ఎపి రాజకీయాల్లో సాగుతోంది. నిన్నమొన్నటి దాకా తెలంగాణ బిడ్డను అని బలంగా చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పుడు శరవేగంగా ఏపీ పాలిటిక్స్ వైపు కదులుతున్నారు.

అది కూడా అధికారంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఢీకొనబోతున్నారు. రాజకీయాల్లో బంధుత్వాలకు తావులేదని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఏ పార్టీతో అవమానాల పాలుపడ్డానని.. తమపై కక్షసాధించారని వైఎస్సార్ సెంటిమెంట్ తో కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చారో ఇప్పుడు అదే పార్టీలోకి షర్మిల వెళ్తున్నార. ఢిల్లీ వెళ్లి రాహుల్, సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతుండటం కచ్చితంగా జగన్ కు మింగుడుపడని వ్యవహారమే.

జగన్ జైలులో ఉన్నప్పుడు 2014కి ముందు వైసీపీ బాధ్యతలను భుజాన మోస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల. 2014 ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ పోరాడారు. కానీ టీడీపీ అధికారం కైవసం చేసుకోవటం, ఈ లోగా జగన్ కు బెయిల్ రావటంతో షర్మిల మెల్లగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. తిరిగి 2019 ఎన్నికల టైమ్ లో యాక్టివేట్ అయ్యారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా బైబై బాబు అనే నినాదంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు. వైసీపీ 151 సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించింది. తన కష్టాన్ని అన్నగుర్తించి పార్టీలో కీలకపదవి అప్పగిస్తారని షర్మిల.. భావించగా అది జరగలేదు. ఈ లోగా జరిగిన వేర్వేరు పరిణామాలతో షర్మిల ఏపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వైఎస్సాఆర్ పేరు మీద వైఎస్సార్ తెలంగాణపార్టీని స్థాపించారు. తెలంగాణలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజావ్యతిరేకతను ఏకం చేస్తూ అనేక ఆందోళనలు, దీక్షలు చేశారు. తీరా ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయలేక అలా అని పొత్తూ పొట్టుకోలేక బయట నుంచి సపోర్ట్ చేశారు.

ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే షర్మిల కాంగ్రెస్ చేరతారనే ప్రచారం జరిగినా అది కాస్త ఆలస్యమై ఆఖరకు ఏపీ వైపు తిరిగింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తన అనుచరులతో కలిసి చేరారు. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని.. ఎన్నికలకు వైఎస్సాఆర్ సెంటిమెంట్ తో షర్మిల కాంగ్రెస్ ను ఏపీలో లీడ్ చేస్తారని ఊహాగానాలు నడుస్తున్నాయి. వైఎస్ సెంటిమెంట్, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు షర్మిల ప్రభావితం చేస్తారని అది ఆ వైసీపీకి ఎదురుదెబ్బ కాగలదని అనుకుంటున్నదే. మరికొంత మంది మాత్రం సెంట్రల్ లెవల్ లో షర్మిల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోందని అంటున్నారు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమే ఇప్పుడు అన్న రాజకీయానికి అడ్డుపడుతుందా అనే చర్చ సాగుతోంది. ఈ ఎత్తుగడలు ఫలించి కాంగ్రెస్ ఎపిలో లబ్దిపొందుతుందా అన్నది చూడాలి.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP