05-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కడప, (జనవరి 5): ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను పాడెక్కిస్తోందని సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ ధ్వజమెత్తారు. వెంటనే రేషన్ డిపోలలో ప్రతి రేషన్ కార్డుదారుడికి రేషన్ కోత లేకుండా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఆసరగా ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను జగన్ ప్రభుత్వం క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తోందన్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఆహారపు నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాల్సిన పౌరసరఫరా శాఖ మంత్రి కొడాలి నాని తన శాఖను వదిలి దివాలాకోరు రాజకీయ మాటలు మాట్లాడుతు పబ్బంగడుపుతుండడం సిగ్గుచేటన్నారు.