05-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, (జనవరి 5): విశాఖలో నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో మనస్థాపంతో మృతి చెందిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. వారిలో ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు తాటిచెట్ల పాలెంలో టీడీపీ కార్యకర్త కనకరాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో మనస్తాపంతో కనకరాజు మృతి చెందారు. భువనేశ్వరి వెంట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వంగలపూడి అనిత, గండిబాబి, సంధ్యారాణి, లలితకుమారి, టీడీపీ నాయకులు కోరాడ రాజబాబు, బండారు అప్పలనాయుడు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, శ్రీనివాసరావు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు గండిబార్జి, సంధ్యా రాణి, లలితకుమారి, టీడీపీ నాయకులు బండారు అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.