05-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 5): అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అందుతాయని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ గారు అన్నారు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు కేంద్రం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బాన్సిలాల్ పేట, రామ్ గోపాల్పేట డివిజన్లోని 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను డాక్టర్ కోట నీలిమ గారు శుక్రవారం సందర్శించి ప్రజలతో, అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంల కాకుండా అర్హులందరికీ పథకాలు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పథకాల అమలుపై విష ప్రచారాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలని హితవు పలికారు. పథకాల అమలులో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రాల వద్ద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. సహాయ కేంద్రాల ఆధ్వర్యంలో ప్రజల సందేహాలను తీరుస్తూ దరఖాస్తు ఫారంను రాయడంలో సహకరిస్తున్నట్లు తెలిపారు.