ad1
ad1
Card image cap
Tags  

  05-01-2024       RJ

అర్హులు ఎవ్వరూ సంక్షేమాన్ని మిస్ కావద్దు.. ప్రజలకు తోడుగా ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్

అమరావతి, (జనవరి 5): అర్హత ఉన్న ఏ లబ్దిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ది అందనివారికి మరో అవకాశమిస్తూ సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు.

గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందనివారికి నిధులను సిఎం జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ లబ్దిదారులెవ్వరూ సంక్షేమ పథకాలు మిస్ కాకూడదన్నారు. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో లబ్ది అందనివారికి నగదు జమ చేస్తున్నామని తెలిపారు. 68,990 మందికి రూ.97.76 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి 6 నెలలకోసారి ఈ నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గత 55 నెలల్లో డీబీటీ ద్వారా రూ.2,46,551 కోట్లు అందించామన్నారు. వలంటీర్లు స్వయంగా వెళ్లి లబ్దిదారులతో దరఖాస్తులు పెట్టించాలని సిఎం ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పలువురు లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. అర్హత ఉన్న ఏ లబ్దిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింప చేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు.

ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి-జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్-జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్-జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు, కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమం.

ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దాన్ని పరిష్కరించడం కోసం వారి తరఫున, మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉందని భరోసా కల్పించే కార్యక్రమం. ఎవరైనా ఏ కారణం చేతనైనా పొరపాటున ఏ పథకం అయినా అందకపోతే, అర్హత ఉండి కూడా పథకం అందకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు స్కీమ్ అయిపోయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టించి, వెరిఫికేషన్ చేయించి ఆ లబ్దిదారుడికి మంచి జరిగిస్తూ నష్టపోకుండా లబ్దిని అందజేసే ఒక మంచి కార్యక్రమం అని అన్నారు. 2021 డిసెంబర్ లో ఈ కార్యక్రమం మొదలు పెట్టి ప్రతి ఆరు నెలలకోసారి చేస్తున్నాం. ఈరోజు ఐదోసారి చేస్తున్నాం. అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ది పొందని వారికి

మళ్లీ తోడుగా ఉంటూ నిలబడుతూ దాదాపు రూ.1,700 కోట్లు వారికి అందజేసే కార్యక్రమం. ఈరోజు దాదాపు వివిధ పథకాలకు సంబంధించి 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్దిని వారికి మళ్లీ అందజేస్తూ రూ.98 కోట్లకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ల బ్యాంకు ఖాతాల్లో అందేట్టుగా చేస్తున్నాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా ఇంతకు ముందు పథకం తీసుకొచ్చినప్పుడు 42.62 లక్షల మంది అర్హత పొందారు. డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. మిస్ ఔట్ అయిపోయిన 40,616 మంది ఉంటే వారికి కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, వెరిఫికేషన్ పూర్తి కావడం వారికి మళ్లీ వెనక్కి వచ్చేట్టుగా చేస్తున్నాం. జగనన్న చేదోడులో అప్పట్లో 3.25 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 15 వేల మంది మిస్ ఔట్ అయిన వారికి ఇస్తున్నాం. ఈబీసీ నేస్తం ద్వారా 4.40 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 4,180 మందికి లబ్ది జరిగిస్తున్నాం.

వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2.80 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు మళ్లీ 3,030 మందికి ఈరోజు మంచి జరగబోతోంది. మత్స్యకార భరోసా కింద అప్పట్లో 1.20 లక్షల మందికి మంచి జరిగితే ఈరోజు మరో 2 వేల మందికి మంచి జరిగిస్తున్నాం. కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అప్పట్లో 29,934 మందికి మంచి జరిగితే 1,912 మందికి మిగిలిపోయిన వారికి మళ్లీ ఈరోజు మంచి జరిగిస్తున్నాం. వైఎస్సార్ కాపు నేస్తం 3.60 లక్షలమందికి అప్పట్లో మంచి జరిగితే, ఇప్పుడు 1884 మందికి మంచి జరిగిస్తున్నాం. నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగింది. ఇప్పుడు 352 మందికి మంచి జరిగిస్తున్నాం. వీళ్లే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం.

మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులు ఈనెల నుంచే వారికి కూడా ఇవ్వడం జరుగుతోంది. 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. పథకం అయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టుకొనే వెసులుబాటు కల్పిస్తూ, వాలంటీర్ సేవలు అందుబాటులో ఉంచడం, సచివాలయంలోకి వారే వెళ్లి దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు, 1902కు ఫోన్ చేసినా వాళ్లు గైడెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీతనం, ఒక ట్రాన్స్ పరెన్సీ, ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న భావన, తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పే సంకేతంగా తెలిపారు. సాంకేతిక కారణాలతో పథకాలు అందని తమలాంటి వారికి తిరిగి మరో అవకాశం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని కారణాలతో సంక్షేమ పథకాలు మిస్ అయిన తమకు మళ్లీ తిరిగి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఎవ్వరూ ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వలేదని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరేనంటూ లబ్దిదారులు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో దరఖాస్తు చేసుకుంటే సరిగ్గా రాలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఏదైనా కారణాలతో మిస్ అయిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు చేస్తున్నారని, అర్హత ఉంటే చాలు సిఫార్సు లేకుండానే సంక్షేమాన్ని ఇస్తున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP