05-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, (జనవరి 5): తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకేమి కాదన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో ఏమి కాదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వల్లే కానిది ఎవరివల్ల అవుతుందని ప్రశ్నించారు. తమ పార్టీకి నష్టం ఏమి లేదని అన్నారు. టికెట్ల విషయములో ఎవరికి అసంతృప్తి లేదన్నారు. తమ పార్టీలో టికెట్లు ఎవరికి ఇచ్చుకుంటే చంద్రబాబుకు ఏం సంబంధమని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు.