05-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
పల్నాడు, (జనవరి 5): ప్రజలు వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యేలు మరోచోట పోటీ చేస్తే ఎలా గెలుస్తారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో బ్రిటీష్ పాలన చేస్తూ, సీఎం జగన్ దోపిడీకి తెరలేపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. సత్తెనపల్లి ఆదినారాయణ వైసీపీ ఎజెంట్ గా పని చేస్తున్నారని మండిపడడ్డారు.
రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజి చౌదరిపై కేసు ఎత్తి వేయాలని చెప్పారు. వైసీపీ పార్టీ పై 100శాతం వ్యతిరేకత ఉందన్నారు. జగన్ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదని చెప్పారు.. జగన్ రోడ్డుపై తిరగలేక హెలికాప్టర్లో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు స్థానం మార్చితే గెలవలేరని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.