05-01-2024 RJ
తెలంగాణ
సంగారెడ్డి, (జనవరి 5): సంగారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనంపై నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్థులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. యాజమాన్యంతోనూ మాట్లాడుతున్నారు.