05-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 5): మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆటో, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం..
మొదట ఆగి ఉన్న ఆటోను, ఆ వెంటనే ఓ బైక్ ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు.