06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): తెలంగాణలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉంటున్న చిన్న మధ్యతరగతి కుటుంబాల వారి సాధక బాధలు పట్టించుకోవాలని విజ్ఞప్తులు చాలానే వస్తున్నాయి. చిన్నపాటి ఉద్యోగులు కూడా ఈ మధ్య అపార్ట్మెంట్స్ లో దిగుతున్నారు.
వానర్స్ మూడు నెలలు రెంటు ముందుగా కట్టించుకుంటున్నారు. నెల నెల చెల్లించే అద్దె డిజిటల్ రూపంలో కడతామంటే ఓనర్స్ నిరాకరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి టాక్స్ రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడుతుంది.
అద్దెకు ఉన్న వారి కరెంట్ కష్టాలైతే సినిమా కష్టాలు అన్నట్లుగా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ మీటర్ ఓనర్ హ్యాండోవర్ లో ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా వాళ్లకే వస్తుంది ఈనెల మీరు కరెంట్ బిల్లు 1000 వచ్చింది, 1200 వచ్చింది అని వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా వాటర్, మెయిన్ టైనెన్సు వసూలు చేస్తున్నారు.
సామాన్యులకు జీవించే హక్కు లేదా? మరి ప్రభుత్వం ఉన్నది దేనికి?
ఉన్నవారికి ఉపయోగపడటానికా ? ఈ మధ్య రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలు బాగున్నాయి, కానీ సొంత ఇల్లు, స్థలం ఉన్నవారికి ఉపయోగం, అద్దెకు ఉన్నవారికి ఉపయోగం లేదు 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ అన్నారు. కానీ కరెంటు మీటర్ ఓనర్స్ పేరు మీద ఉంటుంది. కాబట్టి, అద్దెకు ఉన్నవారు కరెంటు పైసలు కట్టవలసిందేకదా!
ప్రభుత్వానికి ఆదాయం బాగా రావాలంటే.. ఇంటింటికి సర్వే జరిపి అద్దెకు ఉన్నవారి నుండి డిజిటల్ రూపంలో అద్దెలు వసూలు చేస్తే మంచిది. ఇలా చేస్తే ప్రభుత్వానికి కొన్ని కోట్లు టాక్స్ రూపం లో వస్తాయి. ఇప్పుడైనా ప్రభుత్వం చిన్న మధ్యతరగతి ఉద్యోగస్తులను పట్టించుకుంటే మంచిదని సిటీలో ఉన్న పలువురు భావిస్తున్నారు.