06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్ రద్దయ్చింది. ఈ-రేస్ సీజన్-10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా - ఈ రేస్ ను రద్దు చేయడం జరిగింది.
ఎఫ్ఎస్ఐఏ ఈ నిర్ణయం వెల్లడించింది. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీన్ ఇస్తామని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఫార్ములా రేసింగ్ పై నిర్వాహకులు స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. గతేడాది అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈవో తెలిపారు.
అలాగే, ఫార్ములా రేసింగ్ ను హైదరాబాదికి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. ఫార్ములా రేస్ రద్దు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియన్ కామెంట్స్ చేశారు. ఫార్ములా రేసింగ్ రద్దుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం, భారత్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయని సూచించారు. చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారు.ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్ పై తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదు.
భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్ ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించాము. ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బజ్వర్డ్ గా మారిన ప్రపంచంలో హైదరాబాదు ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడానికి ఎంతో కష్టపడ్డామన్నారు.
ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్ ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ ను ఉపయోగించుకుందని వెల్లడించారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్ కోసం తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు.
ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేసింగ్ రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు చాలా నష్టం కలిగిస్తాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.