06-01-2024 RJ
తెలంగాణ
మెదక్, (జనవరి 6): మెదక్ జిల్లా హవేలిఘన్పూర్ మండలం కుచనపల్లిలో విషాదం చోటు చేసుకున్నది. కుమారుడి మరణవార్త తట్టుకోలేక తల్లి మరణించారు. గ్రామానికి చెందిన నరసింహగౌడ్ (36) కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చనిపోయారు.
విషయం తెలుసుకున్న అతని లక్ష్మి (57) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమె కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు. నరసింహగౌడ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, గంట వ్యవధిలోనే తల్లీకొడుకుల మృతితో కుచనపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.