06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): నగరంలోని బేగంపేటలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బేగంపేట ఫ్లై ఓర్పై వేగంగా దూసుకొస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది.
కాగా.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పల్టీకొట్టిన కారును ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.