06-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అనంతపురం, (జనవరి 6): రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా చతికిల పడిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ట్రాన్స్ ఫర్లు వింతగా కనిపిస్తున్నాయన్నారు. ఓ చోట ఫెయిల్ అయిన వారిని మరో నియోజకవర్గంలో ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారన్నారు.
సీఎంగా జగన్ ఫెయిల్ అయ్యాడన్నారు. తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఎమ్మెల్యే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం శిశు పాలుడు లాగా తప్పులు చేశారని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఓ నియంతలా తయారై వ్యవస్థలను బ్రష్టు పట్టించి రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారన్నారు. కాపు రామచంద్రా రెడ్డి జగన్ తన గొంతు కోశారు అంటున్నారని.. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల గొంతు కూడా కోశారన్నారు. రాజకీయనాయ కులుగా వీళ్ళు అర్హులు కాదన్నారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. వైసీపీ లో ఉన్న బీసీ నేతలు... గౌరవంగా ఉండాలి అనుకున్న వారు టీడీపీలోకి రావాలని కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఉద్యోగులను దారుణంగా హింసిస్తున్నారన్నారు. టీడీపీ సహా అన్ని పార్టీల మద్దతు వారికి ఉందన్నారు. అధికారం లోకి వచ్చిన మూడు నెలల్లో వారి సమస్యలు పరిష్కరిస్తామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.