06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): ఫార్ములా రేస్ వల్ల హైదరాబాద్ నగర ప్రజలు గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇప్పుడు రేస్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ట్రాఫిక్ ను స్తంభింప చేసి గత ప్రభుత్వం అవివేక నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందుల్లో పడి.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
రేస్ వల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ రేస్ లు వల్ల పెట్టుబడులు వస్తాయని చెప్పడం తెలివి తక్కువతనమన్నారు. ఫార్ములా రేస్లకు
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నదని అన్నారు.
ఎమ్మెల్సీ కోటా కింద రెండు స్థానాలు ఖాళీగా ఉన్నా ఎన్నికలు వేరువేరుగా జరుగుతాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాగే జరిగాయన్నారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అని... సాధారణ ఎన్నిక కాదన్నారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే ఎన్నికలు జరుగుతాయని నిరంజన్ పేర్కొన్నారు. . హైదరాబాద్ లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా - ఈ రేసు రద్దు చేయడం జరిగింది. ఎఫ్ఎ ఈ నిర్ణయం వెల్లడించింది. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు పేర్కొన్నారు.