06-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (జనవరి 6): వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం నాడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోమని తెలిపారు. తాజా రాజకీయాలను పరిశీలిస్తే షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసుని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బ్రదర్ అనిల్ పై గతంలో టీడీపీ నేతలు ఎలాంటి విమర్శలు చేశారో చూశాం.. ఇప్పుడు అదే బ్రదర్ అనిల్ పక్కన టీడీపీ నేతలు ఫొటోలు దిగుతున్నవి కూడా చూశాం.. దీన్ని బట్టి టిడిపి నేతల పన్నాగాన్ని అర్థం చేసుకోవచ్చాన్నారు.
వైఎస్సార్సీపీ ఆవిర్భవించిన తొలిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఎన్ వివేకానందరెడ్డిని పులివెందుల నుంచి విజయమ్మకు పోటీగా బరిలోకి దింపింది. వైఎస్సార్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలున్నాయి. కాంగ్రెస్ తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు అర్థం అయింది.
అందుకే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను డైవర్ట్ చేయడానికే బాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని నజ్జల మండిపడ్డారు. టీడీపీ నేత బీటెక్ రవిని... బ్రదర్ అనిల్ కలవడం ఇవన్నీ అందులో బాగమే అన్నారు. వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్ కు సంబంధించి ఆ రోజు నుంచే అనుమానాలున్నాయి టీడీపీ, కాంగ్రెస్ కలిసే నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు మోపాయన్నారు. కాంగ్రెస్ తో ఎప్పుటి నుంచో చంద్రబాబు కాంటాక్ట్ లో ఉంటున్నాడు. చంద్రబాబు తనకేం కావాలో ఓ కుట్ర ప్రకారం మిగతా వాళ్లను కలుపుకుని అందరితో కలిసి చేయిస్తాడని అన్నారు.