06-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు, (జనవరి 6): కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ మహిళలు నిరవధిక ధర్నా చేపట్టారు. అంగన్వాడీ మహిళలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. అంగన్వాడీ మహిళలకు జీతాలు పెంచకుండా ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని సోమిరెడ్డి విమర్శించారు.
జగన్ డిక్టేటర్ లా వ్యవహారిస్తున్నాడని, జగన్ ప్రభుత్వంలో నాలుగు రెట్లు ఖర్చులు పెరిగిపోయాయని, ఓ వైపు తల్లులు, పిల్లలు, మరో వైపు అంగన్ వాడీ మహిళలు అల్లాడుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఎస్మాను వెంటనే వెనక్కి తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.