06-01-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కాకినాడ, (జనవరి 6): కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. యానాంలోని దరియాలతిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న వ్యక్తి సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం.. యానాంలో బోటు ప్రమాదం జరిగింది.
దరియాలతిప్ప వద్ద బోటులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న గంగాద్రి అనే వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక, ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది నుంచి దరియాలతిప్పకు వచ్చినట్టు గుర్తించారు.