06-01-2024 RJ
తెలంగాణ
నంద్యాల, (జనవరి 6): హైదరాబాద్ రాయదుర్గంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సురేందర్ ను కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు కాపాడారు. సురేందర్ ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు దగ్గర సురేందర్ ను పోలీసులు కాపాడారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని రాయదుర్గం నుంచి నల్లమల అడవులకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఆత్మకూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. కిడ్నాపర్ల కోసం నల్లమలలో పోలీసులు గాలిస్తున్నారు.