06-01-2024 RJ
తెలంగాణ
వరంగల్, (జనవరి 6): తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇది కేవలం తెలంగాణలోనే కాక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కిందని మంత్రి సీతక్క అన్నారు. మేడారం భక్తుల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 75 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి.. జాతర పనులు పూర్తి చేయాలని ఆమె కోరారు.
జాతరకు వచ్చే భక్తుల ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. జనవరి నెల చివరివరకు జాతర పనులు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎం డిప్యూటీ సీఎంతో జాతరపై రివ్యూ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతర జరుగు తేదీలతో మరొకసారి పోస్టర్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు, వీఐపీలకు ప్రత్యేక ఆహ్వానం ద్వారా వారిని ఆహ్వానిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ప్రత్యేక హోదా కల్పిస్తారని ఆశిస్తున్నామని మంత్రి సీతక్క కోరారు.