06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): హైదరాబాద్ రాజ్ భవన్ లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను సిఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా కప్పి సన్మానించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలావుంటే మాజీ గవర్నర్ నరసింహన్ శనివారం సిఎం రేవంతన్ ను కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు.
సిఎం ఆయనను ఉచితరీతిన సత్కరించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. సిఎం గా రేవంత్ ప్రమాణం చేసి పాలన సాగిస్తున్నారు. సరిగ్గా నెలరోజులు కావచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రముఖులను కలవడం విశేషం.