06-01-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, (జనవరి 6): మూసినది బ్యూటిఫికేషన్ కు ముందడుగు పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్ డిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును, యమునా రివర్ ను సందర్శించి అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమై అధ్యయనం చేశారు.
జనవరి 3వ తేదీన అహ్మదాబాద్ సందర్శించిన మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎండి ఆమ్రపాలి... శనివారం(6వతేది) యమున ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టిపి)లను, వాటి సామర్థ్యాన్ని పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వ నమామి గంగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్(డిజి) అశోక్ కుమార్ ఐఏఎస్ (తెలంగాణ క్యాడర్)తో కలిసి చర్చించారు. ఆ రెండు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల ఉన్నతాధికారులు తమ అనుభవాలను అమ్రపాలికి వివరించారు.