06-01-2024 RJ
సినీ స్క్రీన్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'దేవర' చిత్రానికి సంబంధించి పోస్టర్స్ తప్ప వీడియో గ్లింప్స్ ఏమీ బయటకు రాలేదు. ఇప్పుడు గ్లింప్ కు ముహూర్తం కుదిరింది. ఈ నెల 8న దేవర చిత్రం ఫస్ట్ గ్లింప్స్ న వదలనున్నారు మేకర్స్. ఇదే తరుణంలో మరో గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. ఆ చిత్రం ఆడియో హక్కుల్ని బాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని టీ సిరీస్ సంస్థ ట్వీట్ చేసింది.
దేవర సినిమా ఆడియో రైట్స్ సొంతం చేసుకోవడం గర్వంగా ఉంది. కొరటాల శివ విజన్, అనిరుద్ మాస్టరింగ్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది అనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. అయితే భారీ మొత్తంలో చెల్లించి ఈ హక్కుల్ని తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 8న దేవర గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతు ఓ పోస్టర్ విడుదల చేసింది.
దీంతో ఫ్యాన్స్ అంతా ఈ గ్లింప్సె ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి మరో వార్త కూడా వైరల్ అవుతోంది. గ్లింప్సన్న వెండితెరపై చూసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా 12న 'గుంటూరు కారం', 'హనుమాన్' సినిమాలు థియేటర్లో సందడి చేయనున్నాయి. 'హనుమాన్' సినిమాకి 'దేవర' గ్లింప్స్ ను అటాచ్ చేయనున్నారట. హనుమాన్' మూవీ చూడడం కోసం థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుడికి 'దేవర' గ్లింప్స్ డబుల్ ట్రీట్ ఇవ్వనుంది.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సూపర్ హిట్ అయింది. తదుపరి శివ తీసిన 'ఆచార్య'తో మొదటి ప్లాప్ అందుకున్నారు. అందుకే విజయబాటలో పడాలని తన ఆశలన్నీ 'దేవర'పైనే పెట్టుకున్నారు కొరటాల శివ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది.
సైఫ్ అలీఖాన ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది.